హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న రష్యా, ఉక్రెయిన్ జంట

హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న రష్యా, ఉక్రెయిన్ జంట

ఉక్రెయిన్‌, రష్యాకు చెందిన ఓ జంట హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. హిమచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉంటున్న ఆ జంట గత ఏడాది కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. రష్యాకు చెందిన సెర్గీ నొవికోవ్‌, ఉక్రెయిన్‌ అమ్మాయి ఎలోనా బ్రమోకాలు సనాతన హిందూ ధర్మ ఆచారం ప్రకారం పెళ్లిచేసుకున్నారు. ధర్మశాలలోని దివ్య ఆశ్రమంలో ఈ వేడుక జరిగింది. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య వార్‌ ఉన్న నేపథ్యంలో ఈ పెళ్లి  ప్రత్యేకత సంతరించుకున్నది. స్థానికులు ఈ పెళ్లికి హాజరైన డ్యాన్సులు చేశారు. అతిథులకు కంగ్రి థామ్‌ సంప్రదాయ భోజనాన్ని కూడా పెట్టారు. నిజానికి ఆ రెండు దేశాల మధ్య ప్రస్తుతం యుద్దం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ  పెళ్లి సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది.

 

Tags :