అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్‌ న్యూస్‌. ఇకపై విమానంలో కూడా ఇరుముడి తీసుకెళ్లొచ్చు. దీనికి విమానయాన భద్రతా విభాగం అనుమతించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, ఆదేశాల్ని తాజాగా జారీ చేసింది. తాజా నిబంధనల ప్రకారం కేరళలోని, శబరిమలకు వెళ్లే భక్తులు తమ వెంట కొబ్బరికాయ, పూజా సామగ్రి వంటి ఇరుముడిని విమానంలో తీసుకెళ్లొచ్చు. అయ్యప్ప మాల ధారణ చేసిన భక్తులు స్వామి వారికి నెయ్యి, కొబ్బరి కాయ, ఇతర ద్రవ్యాలతో కూడిని ఇరుముడిని శబరిమల వెళ్లి సమర్పిస్తారు. అయితే, ప్రయాణికుల భద్రత దృష్ట్యా వీటిని విమానంలో తీసుకెళ్లే విషయంలో ఆంక్షలు ఉండేవి. భక్తుల వినతి మేరకు వీటిని తీసుకెళ్లేందుకు తాజాగా అనుమతించింది. దీని కోసం ఇరుముడితో పాటు పూర్తి లగేజీని క్షణ్ణంగా తనికీ చేస్తారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.