సాయి పల్లవి సోదరి పూజ కన్నన్ హీరోయిన్ గా తొలి చిత్రం వచ్చేసింది

సాయి పల్లవి సోదరి పూజ కన్నన్ హీరోయిన్ గా తొలి చిత్రం వచ్చేసింది

సినీ రంగం లో అక్క చెల్లెళ్ళ ఎంట్రీ ఇప్పటిది కాదు  అలనాడు లలిత రాగిణి  పద్మిని. ఇలా  ఎందరెందరో నటి మణులు హీరోయిన్లు గా  అలరించారు తాజాగా  సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ డెబ్యూ సిద్దమైంది. పూజా కన్నన్ నటించిన తొలి తమిళ చిత్రం విడుదలకు సిద్దమైంది. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. సాయి పల్లవికి ఇప్పుడున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.స్టార్ హీరో అయినా సరే సాయి పల్లవికి కోసం ఆగాల్సిందే. సాయి పల్లవికి ఓ కథకు ఓకే చెప్పిందంటేనే అదో విశేషంలా ఉంటుంది. రీమేక్ సినిమా అని చిరంజీవి పక్కన నటించే చాన్స్‌ను కూడా వద్దనుకుంది. ఎన్ని కోట్లు కుమ్మరిస్తామని అన్నా కూడా యాడ్స్‌కు నో చెప్పదు. అందాల ఆరబోతకు నై అంటుంది.అలా సాయి పల్లవి తనకంటూ కొన్ని హద్దులు,గీతలు పెట్టుకుంది. అలా అంత నిక్కచ్చిగా ఉంటుంది కాబట్టే సాయి పల్లవికి ఇంత క్రేజ్. అలాంటి సాయి పల్లవి సోదరిగా పూజా కన్నన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేసింది. సాయి పల్లవి, పూజా కన్నన్ ఇద్దరూ కూడా చూసేందుకు ఒకేలా కనిపిస్తూ ఉంటారు. అయితే పూజా కన్నన్ సినీ ఎంట్రీ గురించి ఇది వరకే ఎన్నో వార్తలు వచ్చాయి. తమిళంలో పూజా కన్నన్ ఎంట్రీ ఉండోబోతోందనే వార్తలు హల్చల్ చేశాయి. అయితే తాజాగా పూజా కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.

స్టంట్ డైరెక్టర్ సిల్వ దర్శకుడిగా మారి చిత్తారాయి సెవ్వనం అనే సినిమాను తీశాడు. దీంట్లో సముద్రఖని, పూజా కన్నన్ ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా సముద్రఖని, పూజా కన్నన్ మీద పోస్టర్‌ను వదిలారు. అయితే ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి వెళ్లోబోతోంది. డిసెంబర్ 3న జీ5లో ఈ చిత్రం రాబోతోందని ప్రకటించారు. మొత్తానికి సాయి పల్లవిలా పూజా కన్నన్ కూడా అందరినీ మెప్పిస్తుందేమో చూడాలి.

 

Tags :