డబ్బు వెచ్చించినా ఇది పరిష్కారమయ్యే పరిస్థితి లేదు

డబ్బు వెచ్చించినా ఇది పరిష్కారమయ్యే పరిస్థితి లేదు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య తీవ్రంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బొగ్గు కొరత, ధరల పెరుగుదల వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. డబ్బు వెచ్చించినా ఇది పరిష్కారమయ్యే పరిస్థితి లేదన్నారు. భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు విధించాల్సి రావొచ్చని హెచ్చరించారు. విద్యుత్‌ అంశంపై కేంద్ర మంత్రి చెప్పింది అవాస్తవమన్నారు. సీఎం ఇప్పటికే సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. ఇళ్లలో కరెంట్‌ వాడకం తగ్గించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలు రాత్రి 6`10 గంటల విద్యుత్‌ వినియోగం తగ్గించాలని సూచించారు. ఇళ్ల స్థలాల పేరుతో లబ్ధిదారులకు తెలియకుండానే కేసులు నమోదవుతున్నాయి. ఇళ్ల నిర్మాణానికి హైకోర్టు తీర్పు శరాఘతంలా మారింది. అఫిడవిట్లు వేయించి ఇళ్ల నిర్మాణాన్ని టీడీపీ అడ్డుకుంటోందన్నారు. హైకోర్టు సింగిల్‌ బెంజ్‌ ఆదేశాలపై డివిజన్‌ బెంచ్‌కు వెళ్తామన్నారు. డివిజన్‌ బెంచ్‌లో ప్రభుత్వానికి న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు.

 

Tags :