శ్రీకాకుళంలో చేపట్టిన ప్రయోగం విజయవంతం

శ్రీకాకుళంలో చేపట్టిన ప్రయోగం విజయవంతం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రంలో టీడీపీ వాళ్ల ఇళ్లకూ వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్హులైన కౌలు రైతులందరికీ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. రైతులకు శాశ్వత లభ్ది, డిపార్ట్‌మెంట్‌కు అకౌంటబులిటీ కోసమే మోటార్లకు మీటర్లు బిగించామని తెలిపారు. మీటర్ల ఏర్పాటుతో కేంద్రం నుంచి ఆర్థిక వెసులుబాటు వస్తుందన్నారు. శ్రీకాకుళంలో చేపట్టిన ప్రయోగం విజయవంతమైందని అన్నారు. టీడీపీ కార్యకర్తల ఆశీస్సులూ ఎమ్మెల్యేలు కోరుతున్నారని తెలిపారు. కొందరు సంక్షేమ పథకాలకు అర్హులు కాకున్నా ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని అన్నారు. టీడీపీ నేతలు వాటిని వీడియో తీసి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

 

Tags :