ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే.. న్యాయ వ్యవస్థల సూచనలతో రాజధానుల బిల్లు తీసుకు వస్తాం: సజ్జల

ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే.. న్యాయ వ్యవస్థల సూచనలతో  రాజధానుల బిల్లు  తీసుకు వస్తాం: సజ్జల

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో సుప్రీం కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రభుత్వ వైఖరికి అనువుగా ఉందని ఆయన అన్నారు. అయితే ఇప్పటికే మూడు రాజధానులకు మద్దతుగా ధర్మాసనం వ్యాఖ్యానించిందని పేర్నినాని కూడా తెలిపారు. అదే తరహాలో మరోసారి సజ్జల మాట్టాడారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన సజ్జల.. మూడు రాజధానులు తెస్తామని చెప్పిన బిల్లును వెనక్కి తీసుకున్నామని వెల్లడించారు. రాజధాని విషయంలో హైకోర్టు లేని చట్టంపై తీర్పు ఇచ్చిందని అన్నారు. ఏపీ శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుందని, మూడు రాజధానులకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం రాజధాని అమరావతి నిర్మాణం పూర్తికావాలంటే రూ.1 లక్ష కోట్లు అవసరమవుతాయని, ఇప్పటివరకు అమరావతిలో పెట్టిన పెట్టుబడులు వృథా కాకుండా ప్రభుత్వం చర్యలు చేపడతుందని, అందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేస్తోందని సజ్జల తెలిపారు. ఇప్పటికైతే రాష్ట్ర రాజధాని అమరావతే అని, కానీ త్వరలో న్యాయవ్యవస్థ నిర్ణయానికి కట్టుబడి మూడు రాజధానులు తీసుకొస్తామని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో కోర్టులు ఎలా వ్యవహరిస్తాయో చూసి అనంతరం వాటికి అనుగుణంగా మూడు రాజధానుల చట్టంపై ముందుకెళ్తామని తెలిపారు.

 

 

Tags :