హాలీవుడ్ రేంజ్ లో ప్రభాస్ 'సలార్' యాక్షన్ పార్ట్

హాలీవుడ్ రేంజ్ లో ప్రభాస్  'సలార్' యాక్షన్ పార్ట్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న ప్రభాస్.. ఈ సినిమా కోసం యూనిట్  ఓ రేంజ్‌లో కష్టపడుతున్నారట. ఈ సినిమా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ రేంజ్ లో  ఉండేలా డైరెక్టర్ పక్కాగా ప్లాన్ చేశారట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి భారీ సినిమాలను లైన్‌లో పెట్టారు. కమిటైన సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని సినిమాలను చకచకా ఫినిష్ చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసిన డైరెక్టర్.. మూడో షెడ్యూల్ మరింత భారీగా ప్లాన్ చేశారని సమాచారం. మూడో షెడ్యూల్ అంతా కూడా చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ ఎంతో కీలకం కాబోతున్న ఈ 'సలార్' సినిమాకు, కేటాయించిన బడ్జెట్‌లో ఎక్కువమొత్తం వీటికే కేటాయిస్తున్నారని, ఈ యాక్షన్ సన్నివేశాలు రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేలా షూట్ చేయాలని ప్రశాంత్ నీల్ స్కెచ్చేశారట. హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతున్న ఈ సినిమా 'బాహుబలి' సిరీస్‌ని మించేలా ఉండాలని ఆయన ఫిక్సయ్యారట. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. భారీ కాస్టింగ్ ఉండేలా నటీనటుల విషయంలో ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్న డైరెక్టర్ కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టితో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారని సమాచారం. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించేసింది.

 

Tags :