శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారిని సంపంగి ప్రాకారంలోని యాగశాలకు వేంచేపు చేసి, వైదిక క్రతువుల తర్వాత స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేసి, మాడవీధుల్లో ఊరేగించారు. ఈ నెల 10న పూర్ణాహుతితో ఈ వేడుకలు ముగియనున్నాయి. ఈసారి పవిత్రోత్సవాలకు భక్తులను అనుమతించడంతో టికెట్లు పొందిన వారు పెద్దఎత్తున పాల్గొన్నారు.

 

Tags :