సమంత ఒంటరిగా ముంబైలో ఉండేందుకు ఫిక్స్ అయిందట?

సమంత ఒంటరిగా ముంబైలో ఉండేందుకు ఫిక్స్ అయిందట?

సమంత, నాగ చైతన్యల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరూ విడిపోతోన్నారని, ఇప్పటికే ఫ్యామిలీ కోర్టును కూడా ఆశ్రయించారనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. మనస్పర్థల కారణంగా ఈ ఇద్దరూ కూడా విడిపోతోన్నారనే రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి రూమర్లు, మీడియా రాసే వార్తలపై మీద సమంత ఆ మధ్య కౌంటర్ వేసింది. కుక్క బొమ్మలు పెట్టి.. ప్రశాంతంగా ఉన్న వాటిపై మీడియా ఇలాంటి రాస్తుంది.. కానీ రియాల్టీలో వేరేలా ఉంటుందని చెప్పుకొచ్చింది.  అయితే అలా సమంత కౌంటర్లు వేసినా కూడా రూమర్లు ఆగడం లేదు. ఫ్యామిలీ కోర్టు వరకు వీరి వ్యవహారం ఎక్కిందని, కుటుంబ సభ్యులు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే సమంత ఇప్పుడు ఒంటరిగా ముంబైలో ఉండేందుకు ఫిక్స్ అయిందట. అక్కడికే మకాం మార్చేసిందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సమంత వేసిన ఓ ట్వీట్ అనేక అనుమానాలకు తెరదీసినట్టు అయింది.

నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ ట్రైలర్ నేడు విడుదలైంది. మామూలుగా అయితే లవ్ స్టోరీ అప్డేట్ల మీద సమంత స్పందిస్తూ ఉంటుంది. అయితే ప్రతీసారి నాగ చైతన్య గురించి ఏదో ఒకటి చెబుతూ ఉంటుంది. కానీ ఈ ట్రైలర్ మీద స్పందిస్తూ చైతన్య గురించి ఏ ముక్కకూడా చెప్పలేదు. కానీ చైతన్య ట్వీట్‌‌కే సమంత రిప్లై ఇచ్చింది.. విన్నర్ అంటూ.. సినిమా టీం మొత్తానికి, సాయి పల్లవికి కంగ్రాట్స్ చెప్పింది. దీంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. చైతన్య పేరును ప్రస్థావించలేదు అంటే వీరి విడాకుల వ్యవహారం నిజమే అయి ఉంటుందని కొందరు అంటున్నారు. చైతన్య ట్వీట్‌కే సమంత రిప్లై ఇస్తే ఇంకా ప్రత్యేకంగా ఆయన పేరును చెప్పడం ఎందుకు? విడాకుల వ్యవహారం, రూమర్లను సమంత ఇలా పరోక్షంగా కొట్టిపారేసిందని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

 

Tags :