జీవితంలో ఎదుర్కోంటున్న అన్ని సమస్యలకు పోరాడాలి! విడాకుల తరువాత సమంత

జీవితంలో ఎదుర్కోంటున్న అన్ని సమస్యలకు పోరాడాలి! విడాకుల తరువాత సమంత

సమంత తాజాగా తన విడాకుల అంశంపై స్పందించింది. నాగ చైతన్యతో విడాకుల తరువాత చనిపోతానని అనుకుందట. బతికే అంత దైర్యముందా? అని అనుమానం వచ్చిందట. కానీ ఇప్పుడు తన లైఫ్‌ను ముందుకు తీసుకెళ్తోందని సమంత చెప్పుకొచ్చింది. సమంత విడాకుల విషయం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. నాగ చైతన్యతో సమంత వేరు పడ్డ తరువాత వచ్చిన వార్తలు, ప్రచారం చేసిన రూమర్లు అందరికీ తెలిసిందే. సమంత మీద నానా రకాల రూమర్లు వచ్చాయి. అక్రమ సంబంధాలను సమంతకు అంటగట్టారు. అబార్షన్ చేసుకుందని ఇలా రకరకాల కామెంట్లు చేశారు. అయితే వాటిపై సమంత మొదటిసారిగా స్పందించింది. నాగ చైతన్యతో విడిపొయిన తరువాత చనిపోతానని అనుకున్నానంటూ సమంత సంచలన కామెంట్స్ చేసింది. ఇటీవల సమంత ఓ మీడియాతో ముచ్చటించింది. మీరు చేడు రోజులను ఎదుర్కోంటే పర్వలేదు.. వాటి గురించి అర్థం చేసుకోండి.. ఏదైనా పనిని మధ్యలోనే ఆపివేసే పరిస్థితి వస్తే దానిని అంగీకరించండి. సమస్యలతో పోరాడుతునే ఉండండి.. అది ఎప్పటికీ అంతంలేని ఓ యుద్ధం అని సమంత చెప్పుకొచ్చింది.

ఇది తన సమస్య.. అంటే ఏంటీ.. తాను ఇంకా తన జీవితాన్ని గడపాలి.. తనకు తెలుసు తన జీవితాన్ని ఇంకా గడపాల్సి ఉందని అర్థమంటూ సమంత చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం తాను వ్యక్తిగత జీవితంలో ఎదుర్కోంటున్న అన్ని సమస్యలతో పోరాడుతూ..తాను ఎంత బలంగా ఉన్నానని తానే ఆశ్చర్యపోతున్నాను అంటూ సమంత తెలిపింది.

 

Tags :