హ్యాండ్ ఇచ్చిన పూజ సామ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్

హ్యాండ్ ఇచ్చిన పూజ సామ్ కు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్

మహేష్ బాబు కోసం బలమైన కథ సిద్ధం చేసిన త్రివిక్రమ్.. తొలుత హీరోయిన్ పూజా హెగ్డే అనుకున్నారు  అయితే తీరా దగ్గరకొచ్చాక ఆ బ్యూటీ హ్యాండివ్వడంతో సమంతతో ప్లాన్ వర్కవుట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారట మాటల మాంత్రికుడు. ఇటు సౌత్, అటు నార్త్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న హీరోయిన్ పూజా హెగ్డే.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయింది. నేటితరం కుర్ర హీరోలకు బెటర్ ఛాయిస్ కావడంతో దర్శకనిర్మాతల చూపు ఈ సుందరిపైనే పడుతోంది. దీంతో కొత్త ప్రాజెక్ట్‌లకు డేట్స్‌ సర్దుబాటు చేయడం పూజా కాస్త కష్టంగా మారుతోందట. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు కాదనుకుంటున్న ఆమె.. త్రివిక్రమ్ సినిమాను కూడా పక్కనబెట్టిందని సమాచారం. #SSMB28గా సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ క్రేజీ కాంబినేషన్‌లో ఓ సరికొత్త ప్రాజెక్ట్‌ త్వరలోనే పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే.

మహేష్ కోసం బలమైన కథ సిద్ధం చేసిన త్రివిక్రమ్.. మహేష్ సరసన నటించబోయే హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టి పూజా హెగ్డేను కన్ఫర్మ్ చేశారట. అయితే ముందు ఒప్పుకున్న పూజా హెగ్డే చివరకు కుదరదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో డేట్స్ సర్దుబాటు కాకనే ఇలా రిజెక్ట్ చేసిందా? లేక వాళ్ళ మధ్య క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వచ్చాయా? అనేది సినీ సిర్కిల్స్‌లో చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉంటే పూజా హెగ్డే కాదని చెప్పిందని వెంటనే సమంతను అప్రోచ్ అయ్యారట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇందుకు సామ్ ఓకే చెప్పేసిందని, డేట్స్ కూడా ఇచ్చిందని టాక్. ఇదే నిజమైతే ''దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం'' సినిమాల తర్వాత మరోసారి హిట్ పెయిర్ మహేష్ బాబు- సమంత సెట్స్‌పై వాలిపోతుంది. 

 

Tags :