అది హక్కు కాదు.. రాష్ట్రాల ఇష్టం.. అమెరికా సుప్రీం

అది హక్కు కాదు.. రాష్ట్రాల ఇష్టం.. అమెరికా సుప్రీం

అమెరికాలో ఇప్పుడు అమలులో ఉన్న గర్భస్త్రావ హక్కును కొట్టివేస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది. అబార్షన్‌ హక్కు అమెరికాలో కేవలం సామాజికపరంగానే కాకుండా రాజకీయంగా కూడా ప్రధాన అంశం అయింది.  మహిళా సామాజిక సంస్థలు దీనిని కొట్లాడి సాధించుకున్నాయి. తరువాతి క్రమంలో ఇది వివాదాస్పదం కూడా అయింది. అయితే కన్సర్వేటివ్‌ల ప్రాబల్యపు సుప్రీంకోర్టు దీనిపై దాఖలు అయిన పిటిషన్‌ను పరిశీలించి 1973 నాటి రో వర్సెస్‌ వాడే కేసులో తీర్పు మేరకు వెలువడ్డ సార్వత్రిక అబార్షన్‌ హక్కును కొట్టివేస్తున్నట్లు తెలిపింది. మహిళలకు అవసరం అనుకుంటే  తన గర్భం తొలగించుకునే వీలు కల్పించేలా ఈ హక్కును నిర్దేశించారు.  హక్కును కల్పించడం సార్వత్రికం చేయలేమని, అయితే దీనిపై దేశంలోని పలు రాష్ట్రాలు వేర్వేరుగా తమ విధానాలను రూపొందించుకోవచ్చని అధిక్యతతో కూడిన తీర్పులో తెలిపారు.

 

Tags :