ఈ సినిమా నా జర్మీకి మరో మెట్టు

ఈ సినిమా నా  జర్మీకి మరో మెట్టు

బోడెంపూడి కిరణ్‍కుమార్‍ సమర్పణలో కెఎస్‍ క్రియేషన్స్ పతాకంపై బర్నింగ్‍ స్టార్‍ సంపూర్ణేష్‍ బాబు హీరోగా లోరాని, మహేశ్వరి హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం బజారు రౌడీ. ఈ చిత్రానికి వసంతనాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. నందిరెడ్డి శ్రీనివాస్‍రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 20న, 300 థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఫస్ట్లుక్‍, టీజర్‍కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్‍ క్లీన్‍ సర్టిఫికేట్‍ ఇచ్చింది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్‍ను విడుదల చేశారు. హీరో సంపూ మాట్లాడుతూ ఈ సినిమా నా జర్నీకి మరో మెట్టు అవుతుందన్నారు. ఈ చిత్రం తనకు ఒక ఎత్తని అన్నారు. కరోనా కారణంగా ఆలస్యమైందన్నారు. తనకు అవకాశం ఇచ్చిన నిర్మాతకు, దర్శకుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. నటుడిగా సంపూర్ణేష్‍లో మరో యాంగిల్‍ను చూస్తారు అన్నారు శ్రీనివాసరావు. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఎంటర్‍టైన్‍ చేస్తుంది అన్నారు. సంపూర్ణేష్‍ కెరీర్‍లో ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్‍గా నిలుస్తుంది అన్నారు ఎగ్జిక్యూటివ్‍ ప్రొడ్యూసర్‍ రాకేష్‍. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు వసంత నాగేశ్వరరావు, హీరోయిన్‍ మహేశ్వరి, నిర్మాత నందిరెడ్డి శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్‍ ప్రొడ్యూసర్‍ రాకేష్‍, యూనిట్‍ సభ్యులు పాల్గొన్నారు.

 

Tags :