"టిప్స్" మ్యూజిక్ రాజు హిర్వాని చేతుల మీదుగా విడుదలైన ”ధగడ్ సాంబ” టీజర్

"టిప్స్" మ్యూజిక్ రాజు  హిర్వాని చేతుల మీదుగా విడుదలైన ”ధగడ్ సాంబ” టీజర్

బి.ఎస్. రాజు సమర్పణలో  ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంపూర్ణేష్ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా ఎన్.ఆర్.రెడ్డి దర్సకత్వంలో తెరకెక్కిన  ”ధగడ్ సాంబ” చిత్రాన్ని నిర్మాత అర్.ఆర్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్భంగా చిత్ర యూనిట్ ”ధగడ్ సాంబ”  టీజర్ ను  ఘనంగా విడుదల చేశారు.అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో 

చిత్ర దర్శకుడు యన్.ఆర్.రెడ్డి మాట్లాడుతూ..సంపు గారు  డబ్బు కాదు ముఖ్యం. ముందు సినిమా చెయ్యండి అని మాకు ధైర్యాన్ని ఇస్తూ మాకు అండగా నిలిచారు. నిర్మాత రాజు గారు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తూ ఫుల్ సపోర్ట్ చేయడం వలన సినిమా బాగా వచ్చింది.కామెడీ యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ ఫైట్స్ చాలా బాగా చేశారు. ఈ సినిమాలో సంపూని సరికొత్తగా చూస్తారు. కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసిన బాలు గారు  చాలా చక్కటి కొరియోగ్రఫీ చేశారు. డేవిడ్ గారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు.  బాషా , జ్యోతి, అప్పారావు, చలాకీ చంటి ,ఫిష్ వెంకట్ అందరూ చాలా బాగా నటించారు..పి.డి రాజు విలన్ గా అద్భుతంగా చేశాడు. నాకిలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత రాజు గారికి  ధన్యవాదాలు అన్నారు.

చిత్ర నిర్మాత రాజు మాట్లాడుతూ..ఈ మూవీలోని పాటల కోసం అద్భుతమైన సెట్స్ వెయ్యడం జరిగింది. పాటలకు సంపూర్ణేష్ తనదైన శైలిలో స్టెప్స్ వెయ్యడం జరిగింది. "ధగడ్ సాంబ" చిత్రంలో హీరోయిన్ సోనాక్షి నటన అదనపు ఆకర్షణ కానుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని అన్నారు.

హీరో "సంపూర్ణేష్ బాబు" మాట్లాడుతూ..కెమెరామెన్ ముజీర్ నాతో కొబ్బరిమట్ట నుండి  జర్నీ చేస్తున్నాడు. జ్యోతి, బాషాలతో మొదటిసారిగా చేస్తున్నాను. దర్శకుడు మంచి కథను సెలెక్ట్ చేసుకున్నారు. నిర్మాత రాజు గారు ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా ఈ చిత్రాన్ని  నిర్మించారు.ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించలేకపోయానే అనే చిన్న బాధ నాలో ఉండేది.అయితే ఈ 2022 లో వచ్చే ఈ సినిమా మాత్రం అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.

సంగీత దర్శకుడు డేవిడ్  మాట్లాడుతూ.. ఇందులో ఉన్న నాలుగు పాటలు కూడా మంచి ఊపున్న పాటలు. మొదటి సారిగా చేస్తున్న నాకు దర్శక,నిర్మాతలు ఫుల్ సపోర్ట్ చేశారు.నాతో పాటు పని చేసిన టీం అందరికీ నా ధన్యవాదాలు అన్నారు.

డిఒపీ. ముజీర్ మాలిక్ మాట్లాడుతూ..నా మిత్రుడు యన్.ఆర్.రెడ్డి గారు సంపు తో సినిమా చేద్దామని చెప్పి నన్ను కెమెరామెన్ గా వర్క్ చేయమన్నారు. దర్శక, నిర్మాతలు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు.ఈ ప్రాజెక్ట్ కు సంపు గారు ఫుల్ సపోర్ట్ చేస్తూ మాతో జర్నీ చేశారు.డేవిడ్ మ్యూజిక్ అద్భుతంగా చేశాడు.ఇందులోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 

ఈ సినిమా చాలా బాగా వచ్చింది .ఈ సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

నటి జ్యోతి మాట్లాడుతూ..సంపు గారు మంచి నటుడే గాక మంచి మనసున్న మనిషి.టీజర్ చాలా బాగుంది.ఇందులోని పాటలు కూడా బాగున్నాయి.ఇందులో నేను మంచి క్యారెక్టర్ చేశాను. చాలా సరదాగా షూట్ చేశాము.ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరుతున్నాను అన్నారు.

జబర్దస్త్ అప్పారావు మాట్లాడుతూ..ఇందులో నాకు మంచి క్యారెక్టర్ లో నటించాను.ఈ సినిమాకు చాలా తీపి గుర్తులు ఉన్నాయి.ఈ టైటిల్ లోనే వైబ్రేషన్ ఉంది.దర్శక,నిర్మాతలు చాలా చక్కగా నిర్మించిన ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

ఆర్టిస్ట్ బాషా మాట్లాడుతూ..దర్శక, నిర్మాత నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు.సంపూ చేసే సినిమాల ద్వారా చాలా మంది ఆర్టిస్టులకు జీవనోపాధి దొరుకుతుంది.కాబట్టి సంపు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

కొరియోగ్రాఫర్ బాలు మాట్లాడుతూ.. డగడ్ సాంబ లో సింగిల్ కార్డ్ చేశాను.నన్ను ప్రోత్సవించి నువ్వు కొరియోగ్రఫీ చేయగలవని దర్శక,నిర్మాతలు నాకు ఫుల్ సపోర్ట్ చేశారు.వారికి నా ధన్యవాదాలు అన్నారు.

ఆర్టిస్టు పి.డి రాజు మాట్లాడుతూ.. నా ఫస్ట్ మూవీ చిరంజీవితో చేసిన మాస్టర్ ద్వారా  ముజీర్ గారు పరిచయ మయ్యారు.అప్పటి నుండి మా స్నేహం కంటిన్యూ అవుతుంది.సంపు మాతో ఫైట్ సీన్స్ అద్బుతంగా చేశారు.

 

Tags :