కాలిఫోర్నియాలో విమాన ప్రమాదం

కాలిఫోర్నియాలో విమాన ప్రమాదం

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ చిన్న పాటి విమానం ప్రమాదానికి గురైంది. శాన్‌ డియాగో శివారు ప్రాంతంలో ఉన్న సాంటీ నివాస గృహాలపై ఆ విమానం నేలకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ట్విన్‌ ఇంజిన్‌ సెస్‌నా 340 విమానం కూలినట్లు అధికారులు తెలిపారు. ఆరిజోనాలోని యుమా నుంచి ఈ విమానం టేకాప్‌ అయ్యింది. విమానం కూలిన ప్రదేశంలో ఓ ట్రక్కు కూడా దగ్ధం అయిన దృశ్యాలు కనిపించాయి. విమాన శిథిలాలకు సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు లేవు. కొన్ని ఇళ్ళు ఈ విమాన ప్రమాదం వల్ల కాలిబూడిదయ్యాయి. ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. కూలిన ప్రదేశంలో ఓ స్కూల్‌ ఉంది. సంతనా హైస్కూల్‌ లో విద్యార్థులు అంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.

 

Tags :