ఇక్రిశాట్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్‌గా సంజయ్ అగర్వాల్

ఇక్రిశాట్ అసిస్టెంట్ డైరెక్టర్  జనరల్‌గా సంజయ్ అగర్వాల్

ఇక్రిశాట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ సంజయ్‌ అగర్వాల్‌ నియామకం అయ్యారు. కనీస మద్దతు ధర కమిటీకి అగర్వాల్‌ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2018`22 మధ్య కాంలో ఇక్రిశాట్‌ గవర్నింగ్‌ బోర్డులో ఎక్స్‌ ఆఫిషియో మెంబర్‌గా సేవలందించారు. 1984వ ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన సంజయ్‌ అగర్వాల్‌ ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఆఫీసర్‌. మహిళా, శిశు సంక్షేమం, రూరల్‌ కో ఆపరేటివ్స్‌, హ్యాండీక్రాఫ్ట్స్‌, టెక్స్‌టైల్స్‌, అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ వంటి విభాగాల్లో ఆయన పని చేశారు. వివిధ హోదాల్లో అటు యూపీ, ఇటు కేంద్ర సర్వీసుల్లో సేవలందించారు. ఈ సందర్భంగా సంజయ్‌ అగర్వాల్‌కు ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ జాక్వెలిన్‌ హ్యుస్‌ స్వాగతం పలికారు.

 

Tags :