ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా సంజయ్ అరోరా బాధ్యతల స్వీకరణ

ఢిల్లీ పోలీస్  కమిషనర్‌గా సంజయ్ అరోరా బాధ్యతల స్వీకరణ

ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా సంజయ్‌ అరోరా బాధ్యతలను స్వీకరించారు. అరోరాది తమిళనాడు క్యాడర్‌. 1998 వ బ్యాచ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌. జులై 31, 2025లో ఆయన రిటైర్‌ కానున్నారు. అరోరాకు ముందు గతంలో ఆస్థానా (గుజరాత్‌ క్యాడర్‌), అజయ్‌ రాజ్‌ శర్మ (యూపీ క్యాడర్‌)లు బాధ్యతలు నిర్వర్తించారు. జైపూర్‌లోని మాల్వియా నేషనల్‌ ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఎలక్ట్రికల్‌ అండర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ చేశారు. 57 ఏళ్ల సంజయ్‌ అరోరా తమిళనాడు పోలీసుకు చెందిన స్పెషల్‌ టాస్కోఫోర్స్‌లో చేశారు. వీరప్పన్‌ అంతం చేసిన టీమ్‌లో ఈయన ఉన్నారు. సీఎం గ్యాలెంటరీ అవార్డు అందుకున్నారు. సీఆర్పీఎఫ్‌, బీఎస్‌ఎప్‌ దళాలోనూ అరోరా కొన్నేళ్లుగా చేశారు. ఇంటర్‌ క్యాడర్‌ డిప్యూటేషన్‌కు అంగీకరించినట్లు కేంద్ర హోంశాఖ తన సర్క్యూలర్‌లో తెలిపింది.

 

Tags :