సంజయ్ దత్ విలన్ గా శేఖర్ కమ్ముల సినిమా...

సంజయ్ దత్ విలన్ గా శేఖర్ కమ్ముల సినిమా...

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా, మూడు భాషలలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అన్న విషయం తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళం లో ఈ చిత్రం విడుదలకి సిద్ధమవుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసి హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

ఎప్పుడూ సింపుల్ లైన్ సినిమాలు చేసే శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ ని ఫేమస్ హీరో అయిన ధనుష్ ఓకే చేసారంటే, ఈ సినిమా కథ ఎంత బలంగా ఉందోనని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్ ని ఢీ కొట్టడానికి ఏకంగా బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ ని రంగంలోకి దింపుతున్నారని సమాచారం.

ధనుష్ కి ధీటైన విలన్ ఎవరు? అన్న ప్రశ్నకి శేఖర్ కమ్ముల నుండి మొదటగా వచ్చిన సమాధానం సంజయ్ దత్ . ఆయన మాత్రమే తాను రాసుకున్న పాత్రకి న్యాయం చేయగలడని శేఖర్ కమ్ముల అన్నారు. దత్  డేట్స్ కోసం సీరియస్ గా ప్రయత్నాలు మొదలు పెట్టారని కోలీవుడ్ లో టాక్.

ఇది నిజంగా శేఖర్ కమ్ముల ఫాన్స్ కి హ్యాపీ మూమెంట్ అని చెప్పాలి. ఎప్పుడు సెన్సిటివ్ పాయింట్స్ ని టచ్ చేస్తూ శేఖర్ సినిమాలు ఉంటాయని అందరికి తెలిసిన విషయమే. అలాంటి డైరెక్టర్ కి సంజయ్ దత్ విలన్ ఏంటి అని అభిమానులు షాక్ అవుతున్నారు. రూటు మార్చి శేఖర్ ఏమైనా భారీ యాక్షన్ చిత్రాన్ని ప్లాన్ చేశాడా? అన్న సందేహాలు కూడా వస్తున్నాయి.

సంజయ్ దత్ కి క్లాస్ పాత్రలు సూట్ అవ్వడం చాలా కష్టం. అదే విధంగా  హీరో ధనుష్ ఇటు క్లాస్ అటు మాస్ పాత్రలలో ఇట్టే ఒదిగిపోతాడు. మరి ఈ ఇద్దరి కాంబో లో ఎలాంటి చిత్రం రాబోతుంది అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శేఖర్ కమ్ముల సంజయ్ కి ఇచ్చిన ఆఫర్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

 

 

Tags :