బీజేపీపై ఆప్ నేత సంచలన వ్యాఖ్యలు.. 53 ఆలయాలను

బీజేపీపై ఆప్ నేత సంచలన వ్యాఖ్యలు.. 53 ఆలయాలను

బీజేపీపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత సంజయ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లో 53 ఆలయాలను కూల్చివేసేందుకు కాషాయ పాలకులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ రిలిజియస్‌ కమిటీకి లేఖ రాసిందని సింగ్‌ పేర్కొన్నారు. ఢిల్లీ లో ఆలయాలను కూల్చేందుకు బీజేపీ ఎలా ప్లాన్‌ చేసిందో తాను వెల్లడిస్తానని తెలిపారు. దేశవ్యాప్తంగా కాషాయ నేతలు మతం పేరుతో డ్రామా చేస్తున్నారని, విద్వేషం వెదజల్లుతున్నారని అన్నారు. అదే మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఢిల్లీ లో 53 ఆలయాలను కూల్చేందుకు కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. ఈ ఆలయాలను తొలగించేందుకు అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వం రిలిజియస్‌ కమిటీ లేఖ రాసిందని తెలిపారు. ఢల్లీి ప్రభుత్వానికి ఈ దిశగా లేఖ అందిందని, దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని సింగ్‌ తెలిపారు.

 

Tags :