సంక్రాంతి బరిలో పందెంకోళ్లు.. సై అంటున్న ఉభయ గోదావరి జిల్లాలు

సంక్రాంతి బరిలో పందెంకోళ్లు.. సై అంటున్న ఉభయ గోదావరి జిల్లాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సంక్రాంతి బరికి సై అంటూ పందెంకోళ్లు కాలు దువుతున్నాయి. పండుగ దగ్గర పడుతున్న కొద్దీ సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. ప్రత్యేక శిక్షణ శిబిరాల్లో నిరంతర సాధనతో రాటుదేలుతూ ఈ సంక్రాంతికి నువ్వా నేనా అన్న రీతిలో సిద్ధమవుతున్నాయి. ఎలాగైనా పందెం కొట్టాలన్న కసితో పందెంరాయుళ్లు కూడా పందెం నీదా నాదా అంటూ ఎంత ఖర్చుకైనా వెనకాడడం లేదు. కోడి పందెలంటేనే గోదావరి జిల్లాలు. ఇక భీమవరం, మెట్ట ప్రాంతాల్లో పండుగ మూడు రోజులు పందెం బరులు తిరునాళ్లను తలపిస్తాయి. భారీ ఎత్తున పందేలు నిర్వహిస్తారు.

కోడి పందేలను వీక్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచే కాదు, దేశ విదేశాల నుంచి ఎన్నారైలు గోదావరి జిల్లాలకు తరలివస్తారు. పందేల్లో డబ్బు సంపాదించాలని కొందరు, తమ సత్తా చాటాలని మరికొందరు పుంజులను బరుల్లోకి దింపుతారు. ఈ ఏడాది కూడా పందేలు భారీ ఎత్తున నిర్వహించేందుకు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, గణవరం, వీరనాసరం, ఐ.భీమవరం, ద్వారకాతిరుమల, తణుకు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, కొవ్వూరు, ఉంగుటూరు, భీమడోలు తదితర ప్రాంతాల్లోని పందెంరాయుళ్లు సిద్ధమవుతున్నారు. పండుగకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో బిజీబిజీగా గడుపుతున్నారు.

 

Tags :