ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున మహేష్ సినిమా ‘సర్కారు వారి పాట’ కు 75 కోట్ల గ్రాస్ : ఇది రికార్డు!

ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున మహేష్ సినిమా ‘సర్కారు వారి పాట’ కు 75 కోట్ల గ్రాస్ : ఇది రికార్డు!

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.36.89 కోట్ల రూపాయ‌ల షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. పరశురామ్ దర్శకత్వంలో జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై.లి, 14 రీల్స్ ప్ల‌స్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మించాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై.లి, 14 రీల్స్ ప్ల‌స్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మించాయి. మే 12న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌లైన ఈ చిత్రానికి తొలి రోజు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. టాక్‌కి భిన్నంగా ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల సునామీని క్రియేట్ చేసింది.

తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.36.89 కోట్ల రూపాయ‌ల షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఇక ఓవ‌ర్ సీస్‌లో మ‌హేష్ సినిమాల‌కు మంచి క్రేజ్ ఉంది. దాన్ని కంటిన్యూ చేస్తూ తొలి రోజున ‘సర్కారు వారి పాట’ 1.2 మిలియ‌న్ డాల‌ర్స్ మార్క్‌ను ట‌చ్ చేసింది. అంటే మ‌న క‌రెన్సీ ప్ర‌కారం చూసుకుంటే రూ.7.5 కోట్ల రూపాయ‌ల గ్రాస్ వ‌చ్చింది. షేర్ ప్ర‌కారం దాదాపు నాలుగు కోట్ల రూపాయ‌ల‌ను లెక్క‌లోకి తీసుకుంటే మొత్తంగా ఇది దాదాపు రూ.41 కోట్లు ఉంటాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ‘సర్కారు వారి పాట’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ వివ‌రాలు:

నైజాం - రూ. 12.24 కోట్లు
సీడెడ్ - రూ. 4.70 కోట్లు (హైర్స్ 1.40 కోట్లు)
ఉత్త‌రాంధ్ర - రూ. 3.74 కోట్లు (రూ.34 ల‌క్ష‌లు హైర్స్‌)
ఈస్ట్ - రూ. 3.25 కోట్లు (రూ.80 ల‌క్ష‌లు హైర్స్‌)
వెస్ట్ - రూ. 3 కోట్లు (1.3 కోట్లు హైర్స్‌)
గుంటూరు - రూ. 5.83 కోట్లు (రూ.3.55 కోట్లు హైర్స్‌)
కృష్ణా - రూ. 2.58 కోట్లు ( రూ.31 ల‌క్ష‌లు)
నెల్లూరు - రూ. 1.56 కోట్లు (రూ. 21 ల‌క్ష‌లు)
హైర్స్‌తో క‌లుసుకుని మొత్తంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లోనే రూ.36.89 కోట్లుగా ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.
వరల్డ్ వైడ్ గా ‘సర్కారు వారి పాట’ కు ఒక్క రోజుకు  75 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు సినిమా టీం ప్రకటించింది. 

 

 

Tags :