విశాఖ శారదాపీఠంలో శత చండీయాగం

విశాఖ శారదాపీఠంలో శత చండీయాగం

విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు మహేశ్వరి అవతారంలో దర్వనమించ్చారు. అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మహేశ్వరి అమ్మవారికి పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర స్వామి, శ్రీ స్వాత్మానందేంత్ర స్వామి హారతులిచ్చి పూజలు చేసారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లోక కళ్యాణార్థం విశాఖ శ్రీ శారదపీఠం శత చండీయాగాన్ని చేపట్టింది. 15 మంది రుత్విక్‌లు ఈ యాగంలో భాగస్వాములయ్యారు. చండికా దేవి విశిష్టతను స్తుతిస్తూ 13 ఆధ్యాయాలను పారాయణ చేస్తున్నారు. మహా కాళికాదేవి, మహాలక్ష్మి, మహా సరస్వతి విశిష్టతను సంస్కృతంలో పారాయణ చేస్తున్నారు. చండీయాగంలో 13 రకాల సుగంధ ద్రవ్యాలతో హోమాలను నిర్వహిస్తున్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన చండీయాగం శాస్త్రోక్తంగా సాగుతోంది. యాగంలో భాగస్వామ్యులైన పండితులకు పీఠాధిపతులు దీక్షా వస్త్రాలను అందించి దీక్షాధారణ చేసారు.

 

Tags :