ఘనంగా తెలుగు సమాఖ్య వేడుకలు

ఘనంగా తెలుగు సమాఖ్య వేడుకలు

సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో తెలుగు సమాఖ్య ప్రథమ వార్షికోత్సవం ఈ నెల 23న ఘనంగా జరిగింది. సమాజసేవకులు జహీర్‌బేగ్‌ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఖురాన్‌ పఠనం, తెలుగుతల్లి గీతాలాపనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సంస్థ లక్ష్యాలు, సేవలను సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య అధ్యక్షులు నాగశేఖర్‌ వివరించారు. ఏపీఎన్‌ ఆర్‌టీఎస్‌ ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుల బీమాపై చైర్మన్‌ మేడపాటి వెంకట్‌,  కార్యవర్గ సభ్యులు పారేపల్లి వీబీ కిశోర్‌, వరన్రపసాద్‌ వివరించారు.

ఈ వేడుకల్లో భాగంగా పాటలు, నృత్యాలు, నాటికలను ప్రదర్శించారు. చిన్నారుల ప్రదర్శనలు వార్షికోత్సవానికి హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నవారిని ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు. తెలుగువారందరికీ తమ సమాఖ్య చేదోడువాదోడుగా నిలుస్తుందని కార్యదర్శి కోనేరు ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.