MKOne Telugu Times Youtube Channel

ఆపిల్‌ను వెనక్కినెట్టిన ఆరామ్‌కో

ఆపిల్‌ను వెనక్కినెట్టిన  ఆరామ్‌కో

ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా ఇప్పటివరకు వెలిగిపోతున్న ఆపిల్‌ ఇన్‌కార్పొరేషన్‌ సౌదీకి చెందిన ఆరామ్‌కో వెనక్కినెట్టేసింంది. చమురు ధరలు పెరగడం ఆరామ్‌కోకు బాగా కలిసి వచ్చింది. అదే సమయంలో టెక్‌ స్టాక్స్‌ వరసగా పతనం అవుతుండడంతో ఆపిల్‌ సంపద కరిగిపోయింది. ఆరామ్‌కో వాటాల విలువ రికార్డు స్థాయికి పెరిగింది. దీంతో ఆరామ్‌కో విలువ 2.43 ట్రిలియన్‌ల డాలర్లకు చేరుకున్నది. దీంతో 2020 తరువాత మరోసారి ఇది ఆపిల్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. ఇదే సమయంలో ఆపిల్‌ షేర్‌ విలువ 5.2 శాతం పడిపోయి 146.50 డాలర్లకు దిగజారింది. దీంతో ఆపిల్‌ మొత్తం విలువ 2.37 ట్రిలియన్‌ డాలర్లకు పై చిలుకు ఉండేది. ఇది ఆనాటి ఆరామ్‌కో మార్కెట్‌ విలు కన్నా ఒక ట్రిలియన్‌ డాలర్లు ఎక్కువ. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరగడంతో ఆరామ్‌కో లాభాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి.

 

Tags :