ఎస్‌బీఐ షాక్ .. డిసెంబర్ 1 నుంచి

ఎస్‌బీఐ షాక్ .. డిసెంబర్ 1 నుంచి

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) క్రెడిట్‌ కార్డ్‌ కస్లమర్లకు షాకింగ్‌ వార్త. డిసెంబర్‌ 1 నుంచి అన్ని ఇఎంఐ కొనుగోలు లావాదేవీలపై ప్రాపెసింగ్‌ ఫీజు రూ.99 ఇంకా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వినియోగదారులు రుణం తీసుకోవడానికి ప్రాపెసింగ్‌ ఫీజు ఉంటుంది. అంటే లోన్ల మాదిరిగానే క్రెడిట్‌ కార్డ్‌ లావాదేవీలపై కూడా ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తాజా ప్రకటనతో కస్టమర్‌లు బై నౌ పే లేటర్‌ (బిఎన్‌పిఎల్‌) ఎంపికతో కొనుగోలు చేయడం ఖరీదైనదిగా మారనుంది. ఇప్పటి వరకు కస్టమర్లు ప్రాపెసింగ్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెసింగ్‌ ఫీ క్రెడిట్‌ కార్డ్‌ ఇఎంఐలతో చేసిన కొనుగోళ్లపై కార్డ్‌ వసూలు చేసే వడ్డీ మొత్తానికి అదనంగా ఉంటుంది. ఇఎంఐ లావాదేవీని రద్దు చేసినట్లయితే ప్రాపెసింగ్‌ ఫీజు తిరిగి చెల్లిస్తారు.

 

Tags :