ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది వరకు పొడిగింపు

ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది వరకు  పొడిగింపు

దేశీయ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సీనియర్‌ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం ఎస్‌బీఐ వీ కేర్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకం గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. సీనియర్‌ సిటిజన్ల కోసం 2020 మేలో ఎస్‌బీఐ ఈ టర్మ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ను ప్రారంభించింది. తొలుత 2020 సెప్టెంబరు వరకు మాత్రమే ఈ పథకం అమల్లో ఉంటుందని తెలిపినప్పటికీ కొవిడ్‌`19 కారంగా ఈ పథకం గడువును పలుమార్లు పొడిగించుకంటూ వచ్చింది. తాజాగా 2023 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఎస్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

 

Tags :