ఎస్‌బిఐ కీలక నిర్ణయం...

ఎస్‌బిఐ కీలక నిర్ణయం...

ఖాతాదారులు తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతూ స్టేట్‌ బ్యాంక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దీని ప్రభావంతో రుణం తీసుకున్న వారికి ఈఎంఐ చార్జీలు పెరగనున్నాయి.  అలాగే కొత్త రుణం తీసుకున్న వారికి కూడా అధిక వడ్డీ పడనుంది. దీంతో ఇది వరకూ 6.85 శాతంగా ఉన్న ఎస్‌బిఐ ఎంసీఎల్‌ఆర్‌ రేటు ఇప్పుడు 7.05 శాతంగా ఉండనుంది. కాగా ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటును పెంచిన నేపథ్యంలో బ్యాంకులన్నీ వడ్డీ రేటును పెంచుతున్నాయి.

 

Tags :