స్మార్ట్‌ ఫోన్లు వాడకంతో జ్ఞాపకశక్తి!

స్మార్ట్‌ ఫోన్లు వాడకంతో జ్ఞాపకశక్తి!

స్మార్ట్‌ ఫోన్లు వాడితే బద్ధకస్తులవుతారని, మతిమరుపు పెరుగుతుందని ఇప్పటివరకు అనుకున్నాం. కానీ స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్‌ పరికరాల వాడకంతో జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. పోన్ల వాడకం చాలా ముఖ్యమైన సమాచారం గుర్తుపెట్టుకునేందుకు  సాయపడుతుందని పరిశోధకులు గుర్తించారు. ఫోన్లు వాడితే నేర్చుకునే అలవాడు తప్పిపోయి డిజిటల్‌ మతిమరుపు వచ్చే ప్రమాదం ఉందని నాడీ వ్యవస్థ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇదంతా తప్పని, ఫోన్ల వాడకంతో ఫోన్లలో సేవ్‌ చేసుకున్న సమాచారాన్ని కూడా గుర్తుపెట్టుకునేలా దోహదం చేస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

 

Tags :