ఢిల్లీ సీఎం కీలక నిర్ణయం.. వారం రోజులపాటు

ఢిల్లీ సీఎం కీలక నిర్ణయం.. వారం రోజులపాటు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటడంతో దేశ రాజధానిలో వారం రోజుల పాటు పాఠశాలలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. పిల్లలు కలుషితమైన గాలిని పీల్చకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులందరూ వారం రోజులు వర్క్‌ ఫ్రం హోం పనులు చేయనున్నట్లు వెల్లడిరచారు. విలైనంత వరకు ప్రైవేటు సంస్థలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం సదుపాయం కల్పించాలని సూచించారు. నవంబర్‌ 14 నుంచి 17 వరకు నిర్మాణ రంగ పనులు అన్నింటిపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో లాక్‌డౌన్‌ విధించాలన్న సుప్రీంకోర్టు సూచనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, తమ ప్రణాళికను సుప్రీంకోర్టు అందజేస్తామని తెలిపారు.

 

Tags :