శుభవార్త.. ముందుల్లేకుండానే హెచ్ఐవీ విముక్తి!

శుభవార్త.. ముందుల్లేకుండానే హెచ్ఐవీ విముక్తి!

హెచ్‌ఐవీ సోకిన వ్యక్తి రోగనిరోధక శక్తి పెంపొందించే ఔషధాలను క్రమం తప్పకుండా వాడాలి. లేకపోతే వైరస్‌ క్రమంగా తన సంఖ్యను పెంచుకుంటూ మరణాన్ని కలుగజేస్తుంది. అయితే, ఎలాంటి ఔషధాలను వాడకుండానే హెచ్‌ఐవీ వైరస్‌ పెరుగుదలను నియంత్రించుకోగలుగుతున్న రోగిని తాజాగా గుర్తించినట్టు అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అమెరికాకు చెందిన ఈ మహిళా రోగిలోని 150 కోట్ల రక్త కణాలను పరిశోధించి ఈ నిర్ధారణకు వచ్చినట్టు పేర్కొన్నారు. హెచ్‌ఐబీ వృద్దిని స్వతహాగా అడ్డుకొనే సామర్థ్యం ఉన్న వారిలో ఈ రోగి రెండో వ్యక్తి (మొదటి రోగి శాన్‌ఫ్రాన్సిస్కో వ్యక్తి) అని వెల్లడిరచారు. హెచ్‌ఐవీ వృద్ధిని అడ్డుకునప్పటికీ, ఆ వైరస్‌ ఉనికిని సమూలంగా తరిమేసే శక్తి ఇంకా ఈ రోగుల్లో లేదని తెలిపారు.

ఎలైట్‌ కంట్రోలర్స్‌లో స్టెరిలైజింగ్‌ క్యూర్‌ ఎలా జరుగుతోందన్నది లోతుగా తెలుసుకోగలిగితే, హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌కు పరిష్కారం లభించినట్టే. వారిలో అత్యంత సహజంగా జరుగుతున్న ఈ పద్ధతిని అనుకరించి, మిగతా వారిని కూడా స్వస్థపరచవచ్చు. ఆ దిశగా ప్రయత్నిస్తున్నాం. బాధితుల రోగనిరోధక వ్యవస్థలు తమంతట తాముగా స్టెరిలైజింగ్‌ క్యూర్‌ను చేపట్టేలా ప్రయోగాలు చేపడుతున్నాం. యాంటీ రిట్రోవైరల్‌ థెరపీతో సంబంధం లేకుండా, వ్యాక్సినేషన్‌తోనే దీన్ని సాధిస్తామన్న నమ్మకం ఉంది అని మసాచూసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రికి చెందిన వైద్య నిపుణురాలు జూ యూ తెలిపారు.

 

Tags :