మంత్రి కొడాలి నానితో పాటు... మరో ముగ్గురికి భద్రత పెంపు

మంత్రి కొడాలి నానితో పాటు... మరో ముగ్గురికి భద్రత పెంపు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంపై అధికార వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో రాష్ట్రం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి కొడాలి నాని సహా మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచింది. కొడాలి నానితో పాటు  ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిలకు అదనపు భద్రత కల్పించారు.  ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాల దృష్ట్యా వారికి భద్రత పెంచారు. కొడాలి నానికి 2G2 అదనంగా 1G4 గన్‌మెన్ల భద్రత ఆయన కాన్వాయ్‌లో అదనంగా మరో భద్రత వాహనాన్ని కేటాయించారు. ముగ్గురు ఎమ్మెల్యేలకు అదనంగా 3G3 గన్‌మెన్లతో భద్రత కల్పించారు. అసెంబ్లీ పరిణామాలపై సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులు వచ్చాయని ఈ నేపథ్యంలో ఫిర్యాదుల ఆధారంగా వారికి భద్రతను పెంచినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

 

Tags :