MKOne TeluguTimes-Youtube-Channel

భారత్ లో అమెరికా రాయబారిగా గార్సెట్టి... సెనెట్ ఆమోదం

భారత్ లో అమెరికా రాయబారిగా గార్సెట్టి... సెనెట్ ఆమోదం

భారత్‌లో అమెరికా రాయబారిగా అధ్యక్షుడు జో బైడెన్‌ సన్నిహితుడు ఎరిక్‌ గార్సెట్టి నియామకం ఖరారైంది. ఆయన నామినేషన్‌ను సెనెట్‌ 54-42 మెజార్టీతో ఆమోదించింది. గార్సెట్టి నామినేషన్‌ 2021 జులై నుంచి పెండిరగ్‌లో ఉంది. ఆయన లాస్‌ ఏంజెలెస్‌ మేయర్‌గా ఉన్నప్పుడు ఒక మాజీ సీనియర్‌ సలహాదారుపై వచ్చిన లైంగిక వేధింపుల వ్యవహారంలో సరైన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంతో కొందరు సెనెట్‌ సభ్యులు గతంలో ఆయన నామినేషన్‌పై అభ్యంతరాలు లేవనెత్తడంతో ఆయన నియామకం పెండిరగ్‌లో పడిరది. ఇప్పుడు సెనేట్‌ ఆమోదంతో ఎట్టకేలకు ఆయన నియామకం ఖారారైంది. దీంతో రెండేళ్లుగా ఖాళీగా ఉన్న అమెరికా రాయబారి పదవి త్వరలోనే  భర్తీ అయ్యే అవకాశం ఏర్పడిరది.

 

 

Tags :