అమెరికన్ సెనెట్ ముందుకు గార్సెట్టి

అమెరికన్ సెనెట్ ముందుకు గార్సెట్టి

భారత్‌లో అమెరికా రాయబారి, లాస్‌ఏంజెల్స్‌ మేయర్‌ ఎరిక్‌ గార్సెట్టి నియామకాన్ని అమెరికా సెనెట్‌ ధ్రువీకరించనుంది. ఈ పదవికి ఆయన నామినేట్‌ చేసిన ఐదు నెలల తర్వాత సెనెట్‌ సమావేశమవుతోంది. సెనెట్‌ విదేశీ సంబంధాల కమిటీ ముందు గార్సెట్టి హాజరవనున్నారు. రిపబ్లికన్‌ సెనెటర్లు ఇన్ని నెలలుగా ఈ సమావేశాన్ని వాయిదా వేస్తూ రావడంతో ఈ ధ్రువీకరణ కూడా వాయిదాపడిరది. వచ్చే ఏడాది డిసెంబరుతో మేయర్‌గా గార్సెట్టి పదవీ కాలం పూర్తికానుంది. 2013 నుండి ఆయన  ఈ పదవిలో వున్నారు. అమెరికా నావికాదళంలో మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారిగా పనిచేశారు. తనకు గార్సెట్టి నుండి వేధింపులు ఎదురయ్యాయంటూ మాజీ అంగరక్షకుడు మాథ్యూ గార్జా దావా వేశారు. ఆ ఆరోపణలను ఆయన తిరస్కరిస్తున్నారు.

 

Tags :