770 బిలియన్ డాలర్లతో అమెరికా సైనిక బడ్జెట్!

770 బిలియన్ డాలర్లతో అమెరికా సైనిక బడ్జెట్!

అగ్రరాజ్యం అమెరికా సైనిక బడ్జెట్‌ ఈ సంవత్సరం 770 బిలియన్‌ డాలర్లుగా ఉండబోతున్నది. ఇది ఒక సంవత్సరానికి అమెరికా సైన్యం కోసం ఖర్చుపెట్టే మొత్తం. ఈ మొత్తంలో ప్రైవేట్‌ సైనిక సామగ్రి ఉత్పత్తి చేసే పరిశ్రమలకు 470 బిలియన్‌ డాలర్లు కేటాయించనున్నారు. రష్యా, చైనా నుండి ప్రమాదం పొంచి ఉన్నదని అమెరికా సైనిక బడ్జెట్‌ను పెంచుకుంటూ పోతుంటాయి. చైనా సైనిక బడ్జెట్‌ 250 మిలియన్‌ డాలర్లు, రష్యా బడ్జెట్‌ 60 బిలియన్‌ డాలర్లు. అమెరికా చైనా రష్యాల కంటే కొన్ని రేట్లు ఎక్కువగా బడ్జెట్‌ ఖర్చు పెడుతున్నది. దాన్ని తట్టుకోవడానికి చైనా, రష్యాలు కూడా తమ సైనిక బడ్జెటు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచుకోవాల్సిన ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రజల సంక్షేమం, ఉపాధి కల్పన, వైద్య సౌకర్యాల కల్పన, మౌలిక సదుపాయల ఏర్పాటు కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులు సైనిక బడ్జెటుకు ఖర్చు పెట్టడం ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతున్నది. సైనిక బడ్జెట్‌కు రక్షణ బడ్జెట్‌ అనే ముద్దుపేరు పెడుతున్నారు.

 

Tags :