భారీ వ్యయ బిల్లుకు అమెరికా ఆమోదం

అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) ఎగువ సభ సెనెట్ 1.70 లక్షల కోట్ల డాలర్ల వ్యయ బిల్లును ఆమోదించింది. స్వదేశంలో వివిధ కార్యక్రమాలపై వెచ్చించడానికి 77.25 కోట్ల డాలర్లను, రక్షణ కోసం 85,800 కోట్ల డాలర్లను కేటాయించింది. ఉక్రెయిన్‌కు సాయం కింద 4,500 కోట్ల డాలర్లను కేటాయించడం విశేషం. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి వీలుగా బిల్లులో రక్షణ వ్యయాన్ని 10 శాతం పెంచడానికి ప్రతిపక్ష రిపబ్లికన్ నాయకుడు మెకానెల్ మద్దతు తెలిపారు. ఇటీవలి మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఒకింతి మెజారిటీ లభించిన విషయం తెలిసిందే. దీనివల్ల బిల్లుకు అడ్డంకులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈ బిల్లు ఆమోద ప్రక్రియను హుటాహుటిన పూర్తి చేశారు. ఎగువ సభ సెనెట్ ఆమోదించిన బిల్లును దిగు సభలో కూడా త్వరగా ఆమోదించి అధ్యక్షుడు బైడెన్ సమ్మతి కోసం పంపుతున్నారు.
Tags :