కాంగ్రెస్ అధ్యక్ష రేసులో దిగ్విజయ్ సింగ్... 30న నామినేషన్

కాంగ్రెస్ అధ్యక్ష రేసులో దిగ్విజయ్ సింగ్... 30న నామినేషన్

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల రేసులో పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ పేరు తెరపైకి వచ్చింది. దిగ్విజయ్‌ సెప్టెంబర్‌ 30న తన నామినేషన్‌ దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి రేసులో దిగ్విజయ్‌ సింగ్‌ పేరు ముందే వినిపించింది. అయితే ఆ పదవి పట్ల తాను ఆసక్తిగా లేనంటూ ఆయన ఆ వార్తలను తోసిపుచ్చారు. కానీ ప్రస్తుతం రాజస్థాన్‌లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గహ్లోత్‌ను పోటీ నుంచి తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆయన  స్థానంలో గాంధీ కుటుంబాని విదేయుడిగా ఉండే మరో సీనియర్‌ నేతకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు అధ్యక్షులు సోనియా గాంధీని కోరారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్‌ పేరు మరోసారి పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ సభ్యుల డిమాండ్‌ మేరకు దిగ్విజయ్‌ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు సమాచారం.

 

Tags :
ii). Please add in the header part of the home page.