ఇస్రో నూతన చైర్మన్ గా సోమనాథ్

ఇస్రో నూతన చైర్మన్ గా సోమనాథ్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతన చైర్మన్‌గా, అంతరిక్ష  శాఖ కార్యదర్శిగా రాకెట్‌ శాస్త్రవేత్త ఎస్‌.సోమనాథ్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా ఉన్న శివన్‌ పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో నూతన చైర్మన్‌గా సోమనాథ్‌ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ విఎస్‌ ఎస్‌సి డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. కేరళకు చెందిన సోమనాథ్‌ కొల్లంలోని పీకే కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ నుంచి మెకానికల్‌  ఇంజనీరింగ్‌ యూజీ డిగ్రీ, ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. 1985లో ఇస్రోలో చేరారు. కేరళ శాస్త్రవేత్తలు జి.మాధవన్‌ నాయర్‌, డాక్టర్‌ కె.రాధాకృష్ణ 2003 నుంచి 2014 వరకు ఇస్రోకు నాయకత్వం వహించారు.

 

Tags :