త్వరలో సెరెనా రిటైర్మెంట్ ?

త్వరలో సెరెనా రిటైర్మెంట్ ?

అమెరికా టెన్నిస్‌ క్వీన్‌ సెరెనా విలియమ్స్‌ కెరీర్‌కు త్వరలో వీడ్కోలు పలకబోతున్నట్టు చెప్పింది. టెన్నిస్‌ నుంచి తప్పుకొని మరోసారి తల్లి కావడంతో పాటు వ్యాపారాలపై దృష్టి సారించాలనుకొంటున్నట్టు తెలిపింది. మరో నెలలో నాకు 41 ఏళ్లు వస్తాయి. కొన్నింటిని త్వజించాలి. టెన్నిస్‌ ప్రపంచానికి ఆవల జీవితంలో నాకు ఎంతో ముఖ్యమైన వాటి గురించి ఆలోచించాలి అని సెరెనా పేర్కొంది. అయితే, రిటైర్మెంట్‌ అనే పదాన్ని మాత్రం నేరుగా వాడలేదు. యూఎస్‌ ఓపెన ముందు జరిగే టొరంటో టోర్నీలో విలియమ్స్‌ బరిలోకి దిగనుంది.

 

Tags :