ఉక్రెయిన్ లో శాంతికి అమెరికా అడ్డుపుల్ల

యుద్దం మొదలైన కొత్తల్లో ఉక్రెయిన్‌తో సంప్రదింపుల అనంతరం యుద్ధ విరమణకు రష్యా సుముఖత ప్రదర్శించినా అమెరికా, దాని మిత్ర దేశాలు అడ్డుపుల్ల వేశాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ వెల్లడించారు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న లవ్రోవ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో యుద్ధం మొదలవగా మార్చి నెలాఖరుకు ఆపేయడానికి తమ రెండు దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించాయని తెలిపారు. తరవాత అమెరికా, దాని మిత్ర దేశాలు అడ్డుపడ్డాయనీ, ఉక్రెయిన్ నుంచి మళ్లీ అటువంటి ప్రతిపాదన రాలేదని అన్నారు.
Tags :