ఈ నెల 10 నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు

ఈ నెల 10 నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు

కాణిపాక శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం (10వ తేదీ) నుంచి 21 రోజుల పాటు  నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ఆలయ ప్రాకారం లోపల మాత్రమే ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు  ఆలయ అధికారులు తెలిపారు.  10వ తేదీన ప్రత్యేక అభిషేకం, పుష్పకావళ్ల కార్యక్రమంతో మొదలయ్యి,  30వ తేదీన అభిషేకం, తెప్పోత్సవంతో ముగుస్తాయి. ఈ మేరకు ఉత్సవ ఏర్పాట్లతో దేవస్థానం అధికారులు తలమునకలయ్యారు.

 

Tags :