MKOne Telugu Times Business Excellence Awards

వరంగల్‌లో అధునాతన డ్రై ఐ చికిత్సను ప్రవేశపెట్టిన శరత్ మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్

వరంగల్‌లో అధునాతన డ్రై ఐ చికిత్సను ప్రవేశపెట్టిన శరత్ మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ కంటి సంరక్షణ నెట్‌వర్క్ అయిన శరత్ మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ తన వరంగల్ ఆసుపత్రిలో రెక్సన్-ఐ అనే అధునాతన డ్రై ఐ ట్రీట్‌మెంట్ టెక్నా లజీని ప్రారంభించింది. అన్ని రకాల డ్రై ఐ లకు సంబంధించి బలహీనపరిచే పరిస్థితితో బాధ పడుతున్న రోగులకు ఈ నాన్-ఇన్వేసివ్, మన్నికైన చికిత్స తిరుగులేని పరిష్కారం. డ్రై ఐ వ్యాధి అనేది కళ్ళు తగి నంతగా కన్నీళ్లు లేదా అవసరమైన నాణ్యతతో కన్నీళ్లను ఉత్పత్తి చేయని పరిస్థితి. ఇది కళ్ల మంట, ఎరు పెక్కడం, అధికంగా ఊసులు (మ్యూకస్) రావడం, కాంతికి సున్నితత్వం, ఎక్కువగా కన్నీళ్లు రావడం, దృ ష్టి మసకబారడం వంటి లక్షణాలతో కూడిన స్థిరమైన అసౌకర్య భావాన్ని కలిగిస్తుంది. ఇటీవలి విశ్లేషణ ప్ర కారం, భారతదేశం  పెరిగిపోతున్న డ్రై ఐ వ్యాధి మహమ్మారి అంచున ఉంది. 2030 నాటికి, 275 మిలియన్ల మంది ప్రజలు ఈ సమస్యతో ప్రభావితమవుతారని అంచనా.

ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ సిన్హా (ఆప్తాల్మాలజీ, కాటరాక్ట్ & రిఫ్రాక్టివ్ సర్జరీ ప్రొఫెసర్, రాజేంద్ర ప్రసాద్ సెంటర్ ఫర్ ఆప్తాల్మిక్ సైన్సెస్, ఎయిమ్స్, న్యూదిల్లీ) మాట్లాడుతూ  డ్రై ఐ వ్యాధి అనేది కళ్ళు తగినంత క న్నీళ్లను లేదా అవసరమైన నాణ్యతతో కన్నీళ్లను ఉత్పత్తి చేయని పరిస్థితి. కళ్ల మంట, ఎరుపెక్కడం,  ఎక్కువగా ఊసులు రావడం, కాంతికి సున్నితత్వం, అధికంగా కన్నీళ్లు, మసకబారడం వంటి లక్షణాలతో   దృష్టి అసౌకర్యానికి దారితీస్తుంది. రాజేష్ సిన్హా అనేక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశాలు, శస్త్రచికిత్స శిక్షణ కోర్సులలో బోధకుడిగా ఉన్నారు. ఆయన యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ (యూఎస్ఏ)లో ఫెలోషిప్ చేశారు.

శరత్ మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ డైరెక్టర్ & మేనేజింగ్ పార్టనర్ డాక్టర్. సి శరత్ బాబు ఈ రంగంలో 30 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న నిపుణులైన కాటరాక్ట్ సర్జన్. పది లక్షల మంది రోగులకు చికిత్స అందించిన, ఫాకోఎమల్సిఫికేషన్ టెక్నిక్ ద్వారా 1.5 లక్షలకు పైగా కంటిశుక్లం శస్త్రచికిత్సలు చేసిన అంకితభావంతో కూడిన సూపర్ స్పెషలిస్ట్ వైద్యుల బృందానికి ఆయన నాయకత్వం వహించారు. ఇటీవల, ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రదేశాలలో 50 సంవత్సరాల మిశ్రమ అనుభవంతో ఉన్న ప్రముఖ కంటి సంరక్షణ నెట్‌వర్క్‌ గా మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్‌ తో చేతులు కలిపారు.

శరత్ మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ అందించే రెక్సన్-ఐ థెరపీ ఎవాపరేటివ్, హైపో-సీక్రెటివ్ డ్రై ఐ రెండింటికీ విజయవంతంగా పనిచేస్తుంది. చికిత్స పూర్తి కాగానే, రోగికి ప్రయోజనాలు ప్రారంభమవుతాయి, దీర్ఘకాలం పాటు ఆ ప్రయోజనాలు కొనసాగుతాయి. చికిత్స సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా, రిలాక్సింగ్ గా ఉంటుంది. ఒక వారం వ్యవధిలో 20 నిమిషాల చొప్పున నాలుగు చికిత్స సెషన్‌లను కలిగి ఉంటుంది.

రెక్సన్-ఐ టెక్నాలజీ ప్రారంభోత్సవం

వరంగల్‌లోని శరత్ మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్‌ లో రెక్సాన్-ఐ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. డ్రై ఐ వ్యాధి చికి త్సలో ఈ అధునాతన సాంకేతికత ఒక ప్రధాన మైలురాయి. ఎందుకంటే ఇది అన్ని రకాల డ్రై ఐ లకు నాన్ - ఇన్వేసివ్, మన్నికైన పరిష్కారాన్ని అందిస్తుంది. శరత్ మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ డైరెక్టర్ & మేనేజింగ్ పార్ట్‌ నర్ డాక్టర్ సి శరత్ బాబు రెక్సన్-ఐ టెక్నాలజీని ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ‘‘వరంగల్‌ లో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టిన మొదటి ఆసుపత్రిగా మేం గర్విస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అత్యుత్తమ కంటి సంరక్షణ సేవలను అందించాలనే మా నిబద్ధతలో ఇది మరొక మైలురాయి’’ అని అన్నా రు.

సేవల విస్తరణ

శరత్ లేజర్ ఐ హాస్పిటల్, మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ విలీనంతో ఏర్పడిన శరత్ మాక్సివిజన్ ఐ హాస్పి టల్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని 15కి పైగా ఆసుపత్రులకు తన సేవలను విస్తరించింది. ఈ విలీనం అత్యా ధునిక సాంకేతికతలు, విధానాలతో ప్రతి సేవకు అపారమైన విలువను జోడిస్తుంది. శరత్ మాక్సి విజన్ ఐ హాస్పిటల్స్ 1993లో శరత్ లేజర్ ఐ హాస్పిటల్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించింది.  తెలంగాణ ప్రాంతం లో ఆప్తాల్మిక్ సబ్-స్పెషాలిటీ, పీడియాట్రిక్ ఆప్తాల్మాలజీ సేవలను అందించిన మొదటి, ఏకైక కేంద్రంగా ఘ నతను సాధించింది. ఇది వరంగల్ జిల్లాలో మెడికల్ రెటీనాను ప్రవేశపెట్టిన మొదటి సంస్థ.  1995లో ఫాకో ఎమల్సిఫికేషన్ సర్జరీ చేసిన రాష్ట్రంలో మొట్టమొదటి సంస్థ ఇది. వరంగల్ జిల్లా,  చుట్టుపక్కల ఉన్న 44 గ్రామాలను కూడా ఇది దత్తత తీసుకుంది. అక్కడ సంస్థ వైద్యులు ఉచిత కంటిశుక్లం శస్త్రచికిత్సలు చేశా రు. అవసరమైన వారికి ప్రాథమిక కంటి సంరక్షణను అందించే ఆరు విజన్ కేంద్రాలను ఇది స్థాపించింది.

 

 

Tags :