మా గొంతు నొక్కేందుకే షరతులతో అనుమతి

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తాను చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రను ఫిబ్రవరి 2వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు వైతెపా అధ్యక్షురాలు వైఎస్, షర్మిల తెలిపారు. ఈ నెల 28 నుంచి పాదయాత్రకు అనుమతి కావాలని కోరగా వరంగల్ పోలీసులు నిరాకరించారని తెలిపారు. ఇంతకుముందు పాదయాత్ర నిలిచిన నర్సంపేట నియోజకవర్గం శంకరమ్మతండా నుంచి తిరిగి మొదలు పెడతామని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలనకు మా పాదయాత్ర చరమగీతం పడుతుంది. ప్రజలు మాకు అడుగడుగునా బ్రహ్మరథం పడుతుంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నారు. అందుకే 15 షరతులు విధిస్తూ అనమతి ఇచ్చారు అని షర్మిల పేర్కొన్నారు.
Tags :