తానా ఫౌండేషన్ చైర్మన్ గా శశికాంత్ వల్లేపల్లి ఎన్నిక

తానా ఫౌండేషన్ చైర్మన్ గా శశికాంత్ వల్లేపల్లి ఎన్నిక

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మళ్ళీ మార్పులు జరుగుతున్నాయి. తానాలో ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా ఫౌండేషన్‌ చైర్మన్‌, ఫౌండేషన్‌ కోశాధికారిలను ఫౌండేషన్‌ సభ్యులు అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జూన్‌ 30 గురువారం సాయంత్రం 8 గంటలకు జరిగిన తానా ఫౌండేషన్‌ ప్రత్యేక సమావేశంలో ప్రస్తుత ఫౌండేషన్‌ చైర్మన్‌ వెంకట రమణ యార్లగడ్డ, ఫౌండేషన్‌ ట్రెజరర్‌ శ్రీకాంత్‌ పోలవరపు మీద అవిశ్వాసం తీర్మానం ఏకగ్రీవం అయ్యింది. ఇదే సమావేశంలో తమ తదుపరి చైర్మన్‌ గా శశికాంత్‌ వల్లేపల్లిని ఫౌండేషన్‌ సభ్యులు ఎన్నుకున్నారు. విద్యాధర్‌ గారపాటిని ఫౌండేషన్‌ సెక్రటరీగా, వినయ్‌ మద్దినేని ఫౌండేషన్‌ ట్రెజరర్‌ గా ఎన్నికయ్యారు. సంస్థలో కొత్తగా చేరిన సభ్యులకి ఓటింగ్‌ హక్కు నిర్మూలించడం పై జరిగిన ఓటింగ్‌ నేపధ్యంలోనే ఈ మార్పులు జరిగినట్టు తెలుస్తోంది.

 

Tags :