మిస్ వరల్డ్ అమెరికాగా శ్రీ శైనీ

మిస్ వరల్డ్ అమెరికాగా శ్రీ శైనీ

ఇండియన్‌ అమెరికన్‌ శ్రీ శైనీ మిస్‌ వరల్డ్‌ అమెరికా 2021గా నిలిచింది. బ్యూటీ అవార్డును నెగ్గిన తొలి ఇండియన్‌ అమెరికన్‌ యువతిగా రికార్డులెక్కింది. వాషింగ్టన్‌ స్టేట్‌కు చెందిన ఆమెకు ఈ సందర్భంగా డయానా హెడెన్‌ కిరీటం పెట్టారు. లాస్‌ ఏంజిల్స్‌లోని మిస్‌ వరల్డ్‌ అమెరికా మెడ్‌క్వార్టర్స్‌లో ఈ కాంపిటిషన్‌ జరిగింది. ఈ సందర్భంగా శ్రీ శైనీ మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంది. మొదట చాలా భయపడ్డాను. ఈ ఫీలింగ్స్‌ను మాటల్లో చెప్పలేను. ఈ క్రెడిట్‌ అంతా మా తల్లిదండ్రులకే దక్కుతుంది. ముఖ్యంగా ఎప్పుడూ నా వెంటనే నిలిచిన మా అమ్మకు, థ్యాంక్యూ మిస్‌ వరల్డ్‌ అమెరికా అని చెప్పింది.  ఈ ఘనత సాధించిన తొలి ఏషియన్‌, తొలి ఇండియన్‌ అమెరికన్‌గా నిలిచినందుకు గర్వంగా ఉందని ఇన్‌స్టాగ్రామ్‌తో తెలిపింది.

 

Tags :