రివ్యూ: నాని, సాయి పల్లవిల నటనే హైలెట్ గా ‘శ్యామ్‌ సింగరాయ్‌'

రివ్యూ: నాని, సాయి పల్లవిల నటనే  హైలెట్ గా ‘శ్యామ్‌ సింగరాయ్‌'

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3/5

నిర్మాణ సంస్థ : నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ 
నటీనటులు: నాని, సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబస్టియన్, జిషు సేన్ గుప్తా, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, అభినవ్ గోమటం, మనీష్ వాద్వా, లీలా సామ్సన్ తదితరులు నటించారు
సినిమాటోగ్రఫి: సాను జాన్ వర్గీస్, ఎడిటర్: నవీన్ నూలి, మ్యూజిక్: మికీ జే మేయర్, 
కథ: సత్యదేవ్ జంగా
నిర్మాత: వెంకట్ బోయనపల్లి, దర్శకత్వం: రాహుల్ సంక్రిత్యన్
విడుదల తేదీ : 24.12.2021

దాదాపు రెండేళ్ల తర్వాత థియేటర్స్‌లోకి వస్తున్న నేచురల్‌ స్టార్‌ నాని మూవీ పై అభిమానులు భారీ అంచనాలను పెంచుకున్నారు. నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంతో తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌'. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ మూవీలోనాని, వాసు, శ్యామ్‌ సింగరాయ్‌ అనే రెండు విభిన్న పాత్రలు పోషించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడం.. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘శ్యామ్‌ సింగరాయ్‌’పై హైప్‌ క్రియేట్‌ అయింది. ఈ రోజు (డిసెంబర్‌ 24)న విడుదల అయిన  ఈ చిత్రం అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది. శ్యామ్‌ సింగరాయ్‌గా నాని ఏమేరకు ఆకట్టుకున్నాడు ? వంటి విశేషాలను రివ్యూ లో చూద్దాం.   

కథ :
సినిమా డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో వాసు దేవ్  గంటా (నాని) షార్ట్ ఫిలిం తీసే ప్రయత్నంలో ఉంటాడు. ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసే క్రమంలో కీర్తి (కృతి శెట్టి)ని చూసి ఆమె వెంటపడి తన షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేయడానికి ఒప్పిస్తాడు. ఆ తరువాత ఇంప్రెస్ అయి ప్రేమలో పడతాడు. తాను తీసిన షార్ట్ ఫిలింతో సినిమా అవకాశాన్ని చేజిక్కించుకొన్న వాసు తొలి మూవీతో బ్లాక్‌బాస్టర్‌ను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా బాలీవుడ్‌లో సినిమా తీసే ఛాన్స్ కొట్టేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా కథ తమ పుస్తకాల నుంచి కాపీ కొట్టారనే శ్యామ్ సింగరాయ్ (నాని ) అనే పబ్లిషర్ కేసు పెట్టడంతో పోలీసులు డైరెక్టర్ వాసును అరెస్ట్ చేస్తారు. అసలు శ్యామ్ సింగరాయ్ (నాని) ఎవరు ? రోజీ (సాయి పల్లవి) కి శ్యామ్ కి ఉన్న సంబంధం ఏమిటి ? వాసుదేవ్ తనకు తెలియకుండానే శ్యామ్ సింగరాయ్ కథను ఎలా కాపీ కొట్టాడు ? ఇంతకీ శ్యామ్ సింగరాయ్ కి – వాసుదేవ్ కి మధ్య ఉన్న కనెక్షన్ ఏమిటి ? అనేది మిగిలిన కథ.

నటీనటుల హావభావాలు :
నాని రెండు పాత్రల్లో వన్ మ్యాన్ షోగా నడిచిన ఈ సినిమాలో.. పాత్ర పరిస్థితులకు తగ్గట్టు రెండు గెటప్స్ లో చక్కగా నటించి నాని మెప్పించాడు. వాసు పాత్రలో ఎనర్జిటిక్‌గా కనిపిస్తే.. శ్యామ్‌ సింగరాయ్ రోల్‌లో ఎమోషనల్ మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ స్ లో మరియు తన డైలాగ్ డెలివరీతో నాని చాలా బాగా నటించాడు. తన నటనతోనే కాకుండా తన లుక్స్ తో కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు. ఇక హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి తన హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ మరియు తన నాట్యంతోనూ ఆకట్టుకుంది. ఓ భారమైన పాత్రను చాలా తన ప్రతిభతో సునాయసంగా తెరపైన మెరుపులు మెరిపించారు. ఇప్పటి వరకు గ్లామర్‌ తారగా, ఫెర్ఫార్మర్‌గా చూసి ఉన్నాం. కానీ శ్యామ్ సింగరాయ్‌లో ఆమె ఫెర్ఫార్మర్‌గా మరో లెవెల్‌లో కనిపిస్తుంది. దేవదాసి పాత్రలో ప్రేక్షకుల మనసుకు మరింత దగ్గరవుతుంది. మరో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి హై ఎనర్జీ, గ్లామర్, చలాకీగా కృతిశెట్టి కనిపించింది. ఉప్పెన తర్వాత గ్లామర్‌కు పూర్తి స్కోప్ ఉన్న పాత్రలో నటించింది. ఇక మడోన్నాసెబాస్టియన్ కూడా ఎవరూ ఊహించిన పాత్రలో కనిపించి థ్రిల్ చేస్తారు. కాస్త డీ గ్లామర్‌గా కనిపించినప్పటికీ.. తన ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

సాంకేతివర్గం పనితీరు :
దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని యాక్షన్ సీక్వెన్స్ స్ బాగున్నాయి. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ మరియు శ్యామ్ సింగరాయ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సీన్స్ బాగున్నాయి. ఇక చివర్లో ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సినిమాను ముగించడం కూడా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫిలో రెండు రకాల వేరియేషన్స్‌తో సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి ఆకట్టుకొన్నారు. ఫస్టాఫ్ మోడరన్ లైఫ్ స్టైల్ ఫీల్‌ను కలిగిస్తే.. సెకండాఫ్‌లో పిరియాడిక్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేశారు. లైటింగ్ పాత్రల మూడ్‌ తెరపైన స్పష్టంగా కనిపించింది. ఎడిటింగ్ విషయానికి వస్తే.. సెకండాఫ్‌లో కొంత మేరకు ల్యాగ్ అనిపిస్తుంది. పాటలు ఆకట్టుకొనే లేవు కానీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్  మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. ఇక నిర్మాతగా వెంకట్ బోయినపల్లి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

విశ్లేషణ:
‘శ్యామ్ సింగరాయ్’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ ఫీల్ గుడ్ యాక్షన్ డ్రామాలో నాని నటన, సాయి పల్లవి డ్యాన్స్, కృతి గ్లామర్ సినిమాలో హైలైట్ నిలిచాయి. సినిమా కూడా కళాత్మకంగా ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంది. అయితే స్క్రీన్ ప్లే లో స్లో నెరేషన్, కొన్ని సన్నివేశాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేకపోవడం సినిమాకి మైనస్ అయ్యాయి. ఐతే, పునర్జన్మ కథతో చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పించినా.. శ్యామ్ సింగరాయ్ ఎమోషనల్‌తో కూడిన భారమైన కథ. సత్యదేవ్ జంగా కథను రాహుల్ తీర్చిదిద్దిన విధానం సినిమాకు పాజిటివ్‌గా మారింది. బీ, సీ సెంటర్లలో ఈ సినిమాకు పెద్దగా స్పందన ఆకట్టుకోపోవచ్చు కానీ... అర్బన్ ఏరియాలో మంచి రెస్పాన్స్ లభిస్తుంది. అలాగే విప్లవం అంటూ తిరిగే వ్యక్తి కుటుంబం ఎదుర్కొనే సమస్యల తాలూకు పర్యవసానాలను కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశారు.  ఫ్యామిలీ, యూత్‌కు బాగా నచ్చే సినిమా అని ఎలాంటి సందేహాలు లేకుండా చెప్పవచ్చు.

 

Tags :