MKOne Telugu Times Youtube Channel

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం

కర్ణాటక లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా సీనియర్‌ నేత సిద్ధరామయ్య  ప్రమాణ స్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ ప్రమాణం చేశారు. కర్టాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ వీరి చేత ప్రమాణం చేయించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. సీఎం,డిప్యూటీ సీఎంతో పాటు మరో ఎనిమిది మంది కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వర, కె.హెచ్‌ మునియప్ప, కె.జె. జార్జ్‌, ఎం. బి. పాటిల్‌, సతీశ్‌ జర్ఖిహోళి, ప్రియాంక్‌ ఖర్గే, రామలింగారెడ్డి, బి. జడ్‌, జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ చేత గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ మంత్రులుగా ప్రమాణం చేయించారు.

 

 

Tags :