250 ఏళ్ల చరిత్రలో అమెరికాలో ఇదే మొదటిసారి

250 ఏళ్ల చరిత్రలో అమెరికాలో ఇదే మొదటిసారి

అమెరికా మెరైన్‌ దళంలోకి ఎంపికైన సిక్కు యువకుడికి తలపాగా ధరించి విధుల్లో పాల్గొనేందుకు అనుమతి లభించింది. ఎంతో పేరున్న మెరైన్‌ 246 ఏళ్ల చరిత్రలో కొన్ని పరిమితులతో సిక్కులకు ఇలాంటి అవకాశం దక్కడం ఇదే ప్రథమ. పూర్తి స్థాయిలో మతమపరమైన వెసులుబాట్లు కల్పించకుంటే కోర్టుకెళతానని తెలిపారు. కాలేజీ చదువు పూర్తయ్యాక సుఖ్‌బీర్‌ సింగ్‌ 2017లో మైరెన్స్‌లో చేరారు. ఫస్ట్‌ లెఫ్టినెంట్‌ స్థాయి నుంచి త్వరలోనే కెప్టెన్‌గా ప్రమోషన్‌ అందుతుందని సుఖ్‌బీర్‌ సింగ్‌ తూర్‌ పేర్కొన్నారు. పదోన్నతి పొందాక తమ మత సంబంధ చిహ్నాలను ధరించడంపై పరిమితులు ఎత్తివేయాలంటూ కోర్టును ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు. భారత్‌ నుంచి వలస వచ్చిన సిక్కు కుటుంబానికి చెందిన సుఖ్‌బీర్‌కు  కొన్ని పరిమితులతో తలపాగా ధరించేందుకు అధికారులు అవకాశం కల్పించారు. సాధారణ విధుల్లో ఉండగా ఆయన తలపాగా ధరించవచ్చు. కానీ, ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరించినప్పుడు తలపాగా ధరిస్తే ఇతరులు అతడిని గుర్తుపడతారు అని మెరైన్‌ వర్గాలు అంటున్నాయి. యుద్ధ విధుల్లో ఉన్నప్పుడు సభ్యుల మధ్య బలమైన టీం స్పిరిట్‌కు ఏకరూపకత అవసరమని పేర్కొంటున్నాయి.

 

Tags :