వైభవంగా కాన్సస్ నగర తెలుగు సంఘం రజతోత్సవ సంబరాలు

వైభవంగా కాన్సస్ నగర తెలుగు సంఘం రజతోత్సవ సంబరాలు

కాన్సస్‍ నగర తెలుగు సంఘం స్థాపించి 25 ఏళ్లు  అయిన సందర్భంగా స్థానిక ఓలేత్‍ బాల్‍ కాన్ఫరెన్స్ హాల్‍లో రజతోత్సవ సంబరాలను ఆగస్టు 28వ తేదీన ఘనంగా నిర్వహించారు. ప్రస్తుత ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‍ శ్రీకాంత్‍ రావికంటి స్వాగతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం వ్యాఖ్యాతలు వంశీ సువ్వారి, శ్రావణి మేకలు వ్యాఖ్యానంతో ఆకట్టుకునేలా సాగింది. మొదట అందరూ కలిసి ఒక గంట సేపు పాత స్మృతులను నెమరు వేసుకుని సరదాగా గడిపారు. ఆ తర్వాత దుర్గ తెల్ల, అంజనదేవి, సరిత రాయన, మంజుల సువ్వారి, శిరీష టేకులపల్లి, లక్ష్మీనాయుడు జ్యోతి ప్రజ్వలనతో అసలైన కార్యక్రమం ప్రారంభం అయింది. మొదట సంఘంకు సేవలు అందించిన అధ్యక్షులను ట్రస్ట్ బోర్డు ఛైర్మన్లను వారి జీవిత భాగస్వాములను సత్కరించడంతో పాటు మెమోంటోలను అందించారు. గత 35 ఏళ్లుగా స్థానిక తెలుగు వారికి, సంఘానికి సేవలు అందిస్తున్న లక్ష్మీనాయుడుకు జీవితసాఫల్య పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమం మధ్యలో స్థానిక గాయకులు విశ్వమోహన్‍ అమ్ముల, నిధి రావుల పాటలు పాడి అలరించారు. మాజీ అధ్యక్షులు, ఛైర్మన్లు వారి వారి అనుభవాలను అందరింతో పంచుకున్నారు. శ్రీనివాస్‍ కోటిపల్లి చెప్పిన అనుభవాలు అందరిని ఆకట్టుకున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు శరత్‍ టేకులపల్లి తన ఉపన్యాసంలో సంఘం చేసిన సాహితి, సేవా కార్యక్రమాల గురించి వివరించారు.

 

Tags :