మాల్‌ ఆఫ్‌ ఇండియాలో విజయవంతంగా ‘సీతారామం’ సక్సెస్‌ మీట్‌

మాల్‌ ఆఫ్‌ ఇండియాలో విజయవంతంగా ‘సీతారామం’ సక్సెస్‌ మీట్‌

ఇల్లినాయిలోని నాపర్‌విల్లేలో ఉన్న మాల్‌ ఆఫ్‌ ఇండియాలో ‘సీతారామం’ సక్సెస్‌ మీట్‌ ఇటీవల జరిగింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన మృణాల్‌ ఠాకూర్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులతో మాల్‌ ఆఫ్‌ ఇండియా ప్రాంగణం క్రిక్కిరిసిపోయింది. అనేక వెబ్‌ సిరీస్‌లు మరియు మ్యూజిక్‌ ఆల్బమ్‌లతో పాటు మరాఠీ, హిందీ మరియు తెలుగు సినిమాలలో పనిచేసిన బహుముఖ నటి మృణాల్‌ ఠాకూర్‌ ను కలిసేందుకు, ఆమెతో ఇంటరాక్ట్‌ అయ్యేందుకు ఎంతోమంది ఉత్సాహాన్ని చూపించారు. ఠాకూర్‌ ముజ్సే కుచ్‌ కెహ్తీ...యే ఖామోషియాన్‌ మరియు కుంకుమ్‌ భాగ్యతో టీవీలో తన నటనా జీవితాన్ని ప్రారంభించి, మరాఠీ చిత్రం విట్టి దండుతో పెద్ద తెరపైకి వచ్చారు. ఆమె హిందీ సినిమాల్లో లవ్‌ సోనియాతో తన కెరీర్‌ను ప్రారంభించింది, ఆ తర్వాత సూపర్‌ 30 మరియు బాట్లా హౌస్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను చేసింది.

మాల్‌ ఆఫ్‌ ఇండియా చికాగో సీతారామం చిత్రం విజయోత్సవాన్ని వైభవంగా నిర్వహించింది. ఈవెంట్‌ హోస్ట్‌లు, వినోజ్‌ చనమోలు మరియు అజయ్‌ సుంకర ఈ సందర్భంగా మృణాళ్‌ ఠాకూర్‌ను సత్కరించారు. సినిమాను  విజయవంతమయ్యేలా తీసిన టీమ్‌కు అభినందనలు తెలిపారు. వేడుకకు మాస్టర్‌గా ప్రాచీ జైట్లీ నటి మరియు ప్రేక్షకులను స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సెషన్‌ ను కూడా నిర్వహించి సమన్వయం చేశారు.

సినిమా నిర్మాత అశ్విన్‌ దత్‌ మరియు ప్రధాన నటుడు దుల్కర్‌ సల్మాన్‌ జూమ్‌ కాల్‌ ద్వారా వేడుకలో పాల్గొన్నారు.  ప్రశ్న`సమాధానాల సెషన్‌లో ప్రేక్షకులతో ఇంటరాక్ట్‌ అయ్యారు. సీతా రామం అనేది హను రాఘవపూడి రచన మరియు దర్శకత్వం వహించిన రొమాంటిక్‌ డ్రామా చిత్రం మరియు వైజయంతీ మూవీస్‌, స్వప్న సినిమా నిర్మించారు.

ఈ వేడుకల్లో భాగంగా ఆగస్ట్‌ 30 నుండి సెప్టెంబర్‌ 3 వరకు మాల్‌ ఆఫ్‌ ఇండియాలో నిర్వహించే 7వ గణేష్‌ మహోత్సవ్‌ అధికారిక పోస్టర్‌ను కూడా ఠాకూర్‌ ప్రారంభించారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు గణేష్‌ ఉత్సవాలకు హాజరై, ఆశీర్వాదం తీసుకుంటారన్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే వర్క్‌షాప్‌లు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎంతోమంది చిన్నారులు, పెద్దలు, మహిళలు పెద్దఎత్తున పాల్గొంటున్న విషయం కూడా తెలిసిందే.  

సీతా రామం చిత్రం అద్భుతమైన బాక్సాఫీస్‌ ప్రదర్శనను పురస్కరించుకుని ప్రశ్నోత్తరాల సెషన్‌ తర్వాత కేక్‌ కటింగ్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది కమ్యూనిటీ నాయకులు కూడా హాజరయ్యారు, ఇందులో ప్రముఖ కమ్యూనిటీ సంస్థల ప్రతినిధులు, సినీ అభిమానులు, పిల్లలు పాల్గొన్నారు. రుచికరమైన విందుతో కార్యక్రమం ముగిసింది. పీపుల్‌ రియాల్టీ సాయిరవి సూరిభొట్ల మరియు రాజ్‌ పొట్లూరి ఈవెంట్‌ స్పాన్సర్‌గా వ్యవహరించారు. నవాబీ హైదరాబాద్‌ హౌస్‌ బిర్యానీ ప్లేస్‌ వారు కూడా ఈవెంట్‌ స్పాన్సర్‌గా వ్యవహరించిన వారిలో ఉన్నారు.

వినోజ్‌ చనమోలు మరియు అజయ్‌ సుంకర, నిర్మాత అశ్వినీదత్‌ హీరో దుల్కర్‌ స్లామాన్‌, హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ తదితరులు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు తానా పాస్ట్‌ ప్రెసిడెంట్‌ సతీష్‌ వేమన ధన్యవాదాలు తెలిపారు. 

 

Click here for Event Gallery

Click here for More Photogallery

 

 

Tags :