ఆరుగురు భారతీయుల అరెస్టు.. ఎందుకో తెలుసా?

ఆరుగురు భారతీయుల అరెస్టు.. ఎందుకో తెలుసా?

కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు విఫలయత్నం చేసిన ఆరుగురు భారతీయులు అరెస్టు అయ్యారు. వారందరి వయసు 19-21 ఏళ్ల మధ్యే ఉంది. అమెరికా కస్టమ్స్‌, సరిహద్దు రక్షణ దళం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం కెనడాలోని ఆంటారియో నుంచి సెయింట్‌ రెజిస్‌ నదిని దాటి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఏడుగురు వ్యక్తులు ప్రయత్నించారు. వారు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానిక గురై మునిగిపోతుండటంతో అధికారులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకొని ఆరుగురిని రక్షించారు. మరొకరు స్వయంగా ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నారు. పడవలో ఉన్న ఏడుగురిలో ఆరుగురు భారత పౌరులని అధికారులు తెలిపారు. అమెరికాలోకి అక్రమగా ప్రవేశించేందుకు ప్రయత్నించినందుకుగాను వారిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారికి సహకరించిన అమెరికా వాసిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

 

 

Tags :